Mahabubnagar Assembly Poll 2023 : ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో మహబూబ్నగర్ నియోజకవర్గంలో రాజకీయం ఊపందుకుంది. అధికార పార్టీ నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మూడోసారి బరిలో నిలిచారు. హాట్రిక్ విజయం కోసం అయన ప్రచారం చేస్తున్నారు. అప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. పండగ తర్వాత గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్తూ.. ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారో ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని చెబుతూ, రాష్ట్ర ప్రగతి ముందుకు సాగాలంటే మరోసారి గులాబీపార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
Congress Election Campaign in Mahbubnagar: మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీ యెన్నం శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఖరారు చేసింది. ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన యెన్నం ఇంటింటికు వెళ్లి ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారెంటీలతో పాటు.. పదేళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో చేరవేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధే కొనసాగుతుందని ప్రజలకు చెబుతున్నారు. మంత్రి ఆగడాలతో నియోజకవర్గం బహిరంగ కారాగారంగా మారిందని.. అవి ఆగాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు
BJP Election Campaign in Mahbubnagar : మహబూబ్నగర్ బీజేపీ స్థానాన్ని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి(Jithendar Reddy) కుమారుడు మిథున్ రెడ్డికి ఖరారు చేసింది పార్టీ అధిష్ఠానం. ఎంబీఏ పూర్తి చేసిన మిథున్ రెడ్డి 2014 నుంచి తండ్రికి తోడుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. యువకుడైన తనకు మహబూబ్నగర్ నియోజక వర్గ ప్రజలు ఒకసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మహబూబ్నగర్లో అభివృద్ధి జరిగిందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. తాను గెలిస్తే ఎమ్మెల్యే ట్యాక్స్ ఉండదని, 30 శాతం కమీషన్లు ఉండవంటూ ఓటర్లను ఆకట్టుకున్నే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గానికి ఓ స్కాలర్