తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ - జడ్చర్ల మున్సిపాలిటీ

మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ తేజస్ నందు లాల్.. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి జడ్చర్ల మున్సిపాలిటీలో పర్యటించారు. ఈ నెల 30న జరగబోయే ఉప ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు.

jadcharla muncipal by elections
jadcharla muncipal by elections

By

Published : Apr 27, 2021, 4:31 PM IST

జడ్చర్లలో ఈ నెల 30న జరగబోయే ఉప ఎన్నికలను.. సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందు లాల్ కోరారు. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాలంటూ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తేజస్ హెచ్చరించారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు వివరించారు. ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగియనుంది.

ఇదీ చదవండి:మరికొన్ని గంటలే గడువు.. ఓట్ల వేటలో అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details