మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్ అమలు తీరును జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు పరిశీలించారు. గడియారం కూడలి నుంచి డ్రోన్ కెమెరాల ద్వారా పరిసర ప్రాంతాలను వీక్షించారు. పోలీసు బందోబస్తు, పరిసర ప్రాంతాల్లో పరిస్థితులపై సమీక్షించారు. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ, పోలీసులకు సహకరించడం పట్ల ఎస్పీ సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని రోజులు ఇలాగే సహకరించండి: ఎస్పీ - మహబూబ్‌నగర్‌లో లాక్‌డౌన్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ
లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించడం పట్ల మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న ఇబ్బందికర వాతావరణం తొలగిపోయే వరకూ ఇలాగే సహకరించాలని కోరారు.
మరిన్ని రోజులు ఇలాగే సహకరించండి: ఎస్పీ
ప్రస్తుత ఇబ్బందికర వాతావరణం తొలగిపోయి, ప్రజలు సంతోషంగా ఉండాలనే భావనతోనే లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని, ప్రజలు ముఖ్యంగా యువత సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చదవండి :రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు
TAGGED:
mahabubnagar latest news