తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎరువుల దుకాణాల్లో ఆర్డీవో తనిఖీలు... డీలర్లకు జరిమానాలు

ఎరువుల డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా, అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని మహబూబ్​నగర్​ ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించారు.

By

Published : Aug 28, 2020, 9:07 PM IST

mahaboobnagar rdo inspected in fertilizer shops in jadcharla
ఎరువుల దుకాణాల్లో ఆర్డీవో తనిఖీలు... డీలర్లకు జరిమానాలు

ఎరువుల డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని... ఎరువులు లభించడంలేదని రైతుల ఆందోళన నేపథ్యంలో ఆర్డీవో శ్రీనివాసులు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో ఆయన తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించారు. డీలర్ల వద్ద ఉన్న నిల్వలు, అమ్మకాలు జరుగుతున్న తీరును పరిశీలించారు.

జడ్చర్లలోని రెండు దుకాణాలు నిబంధనలు పాటించకుండా అమ్మకాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్​ నిబంధనలు పాటించకుండా విక్రయాలు జరిపిన రెండు దుకాణాలకు 10 వేల రూపాయలు జరిమానా విధించారు. ఎరువుల డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తే, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవీ చూడండి:'కొత్త రెవెన్యూ చట్టం తెస్తే మంచి కంటే చెడే ఎక్కువ'

ABOUT THE AUTHOR

...view details