తెలంగాణ

telangana

ETV Bharat / state

యూరియా విక్రయ కేంద్రాల్లో అదనపు కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ - తెలంగాణ తాజా వార్తలు

జిల్లావ్యాప్తంగా ఎక్కడా యూరియా కొరత లేదని మహబూబ్​నగర్​ అదనపు కలెక్టర్ సీతారామరాజు అన్నారు. శుక్రవారం దేవరకద్ర మండల కేంద్రంలోని యూరియా విక్రయ కేంద్రాల్లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

యూరియా విక్రయ కేంద్రాల్లో అదనపు కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ
యూరియా విక్రయ కేంద్రాల్లో అదనపు కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ

By

Published : Aug 28, 2020, 5:00 PM IST

యూరియా కోసం రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని అదనపు కలెక్టర్​ సీతారామరాజు పేర్కొన్నారు. జిల్లాలోని రైతులకు 141 మెట్రిక్ టన్నుల యూరియా అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. దేవరకద్ర మండల కేంద్రంలోని యూరియా విక్రయ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన... స్టాక్ వివరాలతో పాటు, రైతులకు సరఫరా చేస్తున్న తీరును పరిశీలించారు.

యూరియా సరఫరా వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే అందించాలన్నారు. విక్రయ కేంద్రాల నిర్వాహకులు కచ్చితంగా పీవోఎస్​ యంత్రాలను ఉపయోగించాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details