మహబూబ్నగర్ కలెక్టరేట్ నుంచి 15 మండలాల తహసీల్దార్లతో కలెక్టర్ వెంకట్రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వారం రోజుల పాటు సిబ్బందికి ఎలాంటి సెలవులు ఇవ్వకూడదని సూచించారు. చేతులు శుభ్రం చేసుకోవడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
తహసీల్దార్లతో మహబూబ్నగర్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
కరోనా వైరస్ను ఎదుర్కోనేందుకు ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు.
పంచాయతీ రాజ్, రెవెన్యూ, పోలీస్ సహా వివిధ శాఖల అధికారులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లాలో కరోనా కేసులు లేవని... ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకదని పేర్కొన్నారు. నేటి నుంచి జరిగే మినీ పల్లె ప్రగతిలో మురుగు కాలువలు, ఖాళీ స్థలాలు, రహదారులు, వాటర్ ట్యాంకులు సహా అన్ని ప్రాంతాలను శుభ్రపరచాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారి కోసం ప్రతి కార్యాలయంలో హ్యాండ్ వాష్ కోసం రెండు బకెట్ల నీళ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఇవీ చూడండి:ఓవైపు సర్వసభ్య సమావేశం...మరోవైపు ఫోన్లో కాలక్షేపం