మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా పర్యటించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులను పరిశీలించారు. జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లిలో పర్యటించిన కలెక్టర్... స్మశాన వాటిక, రైతు వేదిక, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు.
కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. అధికారుల ఉరుకులు పరుగులు - mahaboobnagar news
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కలెక్టర్ ఆకస్మిక పర్యటనతో ఉరుకులు పరుగులు పెట్టటం అధికారుల వంతైంది.

mahaboobnagar collector venkatrao visited in jadcharla constituency
పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బాలానగర్ మండలం పెద్దపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను కలెక్టర్ పరిశీలించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ ఆకస్మిక పర్యటనతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.