మార్చి ఒకటి తర్వాత విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని జల్లెడ పట్టి గుర్తించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కరోనాపై జిల్లాలోని అన్నిశాఖల అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
'కరోనాపై ఆందోళన వద్దు... మీకు తోడుగా మేమున్నాం' - కరోనాపై కలెక్టర్ సమీక్ష
కరోనాపై ఆందోళన వద్దు... మీకు అండంగా అధికార యంత్రాంగం వెన్నంటి ఉంటుందని ప్రజలకు భరోసా కల్పించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు.
!['కరోనాపై ఆందోళన వద్దు... మీకు తోడుగా మేమున్నాం' mahaboobnagar collector venkatrao review on corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6488528-thumbnail-3x2-collector.jpg)
'కరోనాపై ఆందోళన వద్దు... మీకు తోడుగా మేమున్నాం'
'కరోనాపై ఆందోళన వద్దు... మీకు తోడుగా మేమున్నాం'
జిల్లాలో మతపరమైన ఉత్సవాలు, జాతర్లు నిర్వహించవద్దని... ఆయా ప్రాంతాల్లో తక్షణమే 144వ సెక్షన్ విధిస్తున్నట్లు వెల్లడించారు. కార్యాలయాలు, బస్టాండ్లు రైల్వే స్టేషన్లలో ధర్మా మీటర్ల ఏర్పాటుతో పాటు శానిటేషన్ పెంచాలన్నారు. ముందు జాగ్రత్త చర్యలను రెట్టింపు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అధికార యంత్రాంగం తోడుగా ఉంటుందనే భరోసా కల్పించాలని సూచించారు.