మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని పాలకొండ గ్రామ సరిహద్దులో ఉన్న లావుని పట్టాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే ఈటీవీ భారత్ కథనానికి కలెక్టర్ ఎస్.వెంకట్రావు స్పందించారు. విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన
మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని లావుని పట్టా భూములు అన్యాక్రాంతంపై ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. భూ వివాదంపై స్పందించిన కలెక్టర్ వెంకట్రావు విచారణకు ఆదేశించారు.
పాలకొండ గ్రామ సరిహద్దులోని 79వ సర్వే నెంబర్లలోని లావుని పట్టా భూముల్లో క్రయవిక్రయాలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సర్వే నెంబర్లలో 3, 4 సబ్ డివిజన్లుగా పట్టా భూములు ఉన్నాయన్నారు. ఇందులో కొన్ని ప్రైవేటు పట్టా భూములు ఉండగా... మరికొన్ని లావుని పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. వీటిలో లావుని పట్టా భూములు ఏ సబ్ డివిజన్ కిందకు వస్తాయి అనే అంశంపై విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా అదనపు కలెక్టర్ ను ఆదేశించినట్టు వివరించారు. ఆ నివేదికను రెవెన్యూ రికార్డులతోపాటు సబ్ రిజిస్ట్రార్ రికార్డులతో సరి చూసిన అనంతరం వాటిపై చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు.