నివర్ తుఫాన్ వల్ల జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు సూచించారు. జిల్లాలోని రాజాపూర్ మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్ - మహబూబ్నగర్ జిల్లాలో నివర్పై కలెక్టర్ అప్రమత్తం
నివర్ తుఫాన్ ప్రభావంతో రైతుల పంటలను కాపాడేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని మహబూబ్నగర్ జిల్లా పాలనాధికారి వెంకట్రావు అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం తడవకుండా మార్కెట్లలో టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలోని రాజాపూర్ మండలంలోని కేంద్రాన్ని సందర్శించారు.
ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్
రైతులు తీసుకొచ్చిన ధాన్యం వర్షంలో తడవకుండా టార్పాలిన్లను సిద్ధం చేయాలని తెలిపారు. పొలాల్లో పంటను రైతన్నలు కాపాడుకునేలా వారిని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని తుఫాన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ నష్టనివారణ చర్యలు చేపట్టాలని పాలనాధికారి వెల్లడించారు.