మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో విషాదం చోటుచేసుకుంది. భూత్పూర్ మండలం వెల్కిచర్లకు చెందిన భీమన్న అనే రైతు తన భార్య, మనుమడితో కలిసి వరిధాన్యాన్ని అమ్మేందుకు మార్కెట్‌యార్డుకు వచ్చాడు. ఆవరణలో కుప్పగా పోసి రాత్రి ముగ్గురు అక్కడే పడుకున్నారు. మార్కెట్లో నిల్వ ఉన్న మొక్కజొన్నను తరలించేందుకు వచ్చిన లారీ పడుకొని ఉన్న రైతుపై నుంచి వెళ్లింది.
మార్కెట్‌యార్డులో పడుకున్న రైతుపైకి దూసుకొచ్చిన లారీ - LORRY ACCIDENT IN MARKET YARD
పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు వచ్చిన రైతు. రాత్రి అక్కడే పడుకున్నాడు. భార్య, మనుమడితో కలిసి నిద్రిస్తున్నాడు. ఇంతలో ఓ లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది.
తాటిపత్రి కప్పుకుని పడుకున్న రైతు కుంటుంబాన్ని లారీ డ్రైవర్ గమనించకపోవటం వల్ల ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భీమన్న రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతు భార్య, మనుమడు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. బాధితున్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రున్ని హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధిత రైతుకు మెరుగైన వైద్యం అందిస్తామని మార్కెట్ ఛైర్మన్ మురళి హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: నేను లంచగొండిని కాదని చెప్పుకున్నా.. సమస్యేనా