మహబూబాబాద్ జిల్లాలో 10వరోజు లాక్డౌన్ పకడ్భందీగా అమలవుతుంది. వెసులుబాటు సమయంలో కూరగాయల మార్కెట్, కిరణా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. 10 గంటలకు ముందే పట్టణంలో పోలీసులు సైరన్‌తో గస్తీ తిరగడంతో.. వ్యాపార సముదాయాలను కచ్చితంగా 10 గంటలకే మూసివేశారు.
పాలమూరులో పటిష్ఠంగా లాక్డౌన్ అమలు - తెలంగాణ న్యూస్ అప్డేట్స్
పాలమూరులో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు పోలీసులు. జిల్లాలో 11 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

lockdown implementation in Mahbubnagar district
10 గంటల తర్వాత ఆర్టీసీ బస్టాండ్, రహదారులు నిర్మానుష్యంగా మారాయి. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు జరిగేందుకు జిల్లాలో పోలీసులు 11 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. అన్ని చెక్ పోస్టులు, ప్రధాన కూడళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు.10 గంటల తర్వాత కూడా తెరిచి ఉన్న దుకాణాలకు ఫైన్లు విధిస్తున్నారు.
ఇదీ చదవండి:సెంట్రల్ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట