30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. 30 రోజుల పాటు అధికారులు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటారని.. పల్లెల్లోని అన్ని సమస్యలు పరిష్కరించడానికి నెలరోజుల్లో ప్రణాళిక రూపొందిస్తారని గ్రామస్థులకు తెలిపారు. నర్సరీ, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, పారిశుద్ధ్యంపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేద్దాం..
మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్