Leopard in amrabad tiger reserve: మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో కొత్తగా ప్రారంభించిన టైగర్ స్టేకు పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అడవుల్లో సంచరించే పులులు, చిరుతలు సహా ఇతర జంతువులను నేరుగా చూసేందుకు పర్యాటకులు సఫారీ టూర్‌పై ఆసక్తి చూపుతున్నారు. బుధవారం రోజు టైగర్ స్టేలో భాగంగా సఫారీ టూర్‌కి వెళ్లిన పర్యాటకులకు రెండు చిరుతలు కనిపించాయి.
Leopard in amrabad tiger reserve: ఒకే దగ్గర రెండు చిరుతలు... సఫారీ టూర్‌లో... - మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు
Leopard in amrabad tiger reserve: జీవవైవిధ్యంతో అలరారుతున్న అమ్రాబాద్ టైగర్ రిజర్వులో... కొత్తగా ప్రారంభించిన టైగర్ స్టేకు పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అడవుల్లో సంచరించే పులులు, చిరుతలు సహా ఇతర జంతువులను నేరుగా చూసేందుకు పర్యాటకులు సఫారీ టూర్‌పై ఆసక్తి చూపుతున్నారు. బుధవారం రోజు టైగర్ స్టేలో భాగంగా సఫారీ టూర్‌కి వెళ్లిన పర్యాటకులకు రెండు చిరుతలు కనిపించాయి.
![Leopard in amrabad tiger reserve: ఒకే దగ్గర రెండు చిరుతలు... సఫారీ టూర్‌లో... Amrabad Tiger Reserve](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13792626-225-13792626-1638417601596.jpg)
Amrabad Tiger Reserve
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పర్యాటకులకు కనిపించిన చిరుత...
ఫర్హాబాద్ వ్యూపాయింట్ చూసుకుని తిరుగు ప్రయాణమైన వారికి ఫర్హాబాద్ సమీపంలో రెండు చిరుతలు అడవుల్లో సంచరిస్తూ దర్శనమిచ్చాయి. అవి ఆడ ,మగ చిరుతలని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఎఫ్డీఓ రోహిత్ తెలిపారు. అమ్రాబాద్‌లో పర్యాటకులకు చిరుతలు కనిపించడం చాలా అరుదు. అలాంటింది పులి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్న పర్యాటకులకు రెండు చిరుతలు కనిపించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇదీ చదవండి:ఇంటర్ కాలేజ్‌లో చిరుత హల్చల్.. విద్యార్థిపై దాడి