కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఉందని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు రామచందర్ అన్నారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి అఖిల భారత రైతు కూలీ సంఘం దేవరకద్రలో ఆందోళనకు దిగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి' - farmers protest in mahabubnagar
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో అఖిల భారత రైతూ కూలీ సంఘం ఆందోళనకు దిగింది. కేంద్రం తీసుకొచ్చిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
!['వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి' left parties protest in mahabubnaga](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8890734-41-8890734-1600772317676.jpg)
మహబూబ్నగర్లో రైతుల ఆందోళన
రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని యెడల ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, ఐఎఫ్టీయూ, ఏఐకేఎంఎస్ నాయకులు పాల్గొన్నారు.