కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, వామపక్షాల శ్రేణులు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌ను ముట్టడించాయి.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వామపక్షాల ఆందోళన - left parties protest in mahabubnagar
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌ను ముట్టడించారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వామపక్షాల ఆందోళన
కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసేందుకే.. 18 రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా భాజపా మొండిగా వ్యవసాయ బిల్లులను పార్లమెంట్లో ఆమోదింపజేసిందని నేతలు ఆరోపించారు. రైతుకు మేలు జరుగుతుందన్న పేరుతో వ్యవసాయాన్ని కార్పొరేటు సంస్థల హస్తాల్లో చిక్కుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రవేశపెట్టిన ఈ బిల్లులు అమల్లోకి వస్తే.. భవిష్యత్తులో దేశ ఆహార భద్రతకు సైతం ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఈ బిల్లులను వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.