తెలంగాణ

telangana

ETV Bharat / state

వృద్ధురాలి భూమి అమ్మేసిన తోటికోడలు.. పట్టించుకోని అధికారులు.. - పట్టించుకోని అధికారులు..

బతుకుదెరువు లేక ఉన్న ఇంటినీ, భూమిని వదిలేసి హైదరాబాద్ వెళ్లిందో వృద్ధురాలు.  ఐదారేళ్లకు ఇంటికి తిరికొచ్చేసరికి తన మరిది భార్య  భూమిని అమ్మేసింది. బాధితురాలు 6 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగుతోంది. అయినా ఎలాంటి ఫలితం లేదు. నిన్న రాత్రి ఇంటికెళ్లేందుకు కూడా డబ్బుల్లేక కార్యాలయంలోనే పడుకుందా వృద్ధురాలు.

వృద్ధురాలి భూమి అమ్మేసిన తోటికోడలు.. పట్టించుకోని అధికారులు..

By

Published : Sep 27, 2019, 1:44 PM IST

మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రాఘవపూర్​ గ్రామంలోని సర్వే నెంబర్ 36లో గల 3 ఎకరాల 15 గుంటల భూమికి సంబంధింన వివాదాన్ని పరిష్కరించాలంటూ ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని గురాల లక్ష్మమ్మ ఆరోపించారు. తమకు చెందాల్సిన భూమిని తోటికోడలు ఇతరులకు అమ్మేసి ఈరి నుంచి వెళ్లిపోయిందని...కొన్నవాళ్లెవరో తెలియదని న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఈ వివాదాన్ని పరిష్కరించాలని 6 నెలలుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి తిరగడానికి డబ్బులు లేక నిన్నరాత్రి కార్యాలయంలోనే నిద్రించనట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు.

వృద్ధురాలి భూమి అమ్మేసిన తోటికోడలు.. పట్టించుకోని అధికారులు..

ABOUT THE AUTHOR

...view details