ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికై ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ స్వీయ గృహ నిర్బంధం చేసుకున్న మహిళా కండక్టర్లు దీక్ష విరమించారు. మహబూబ్‌నగర్ డిపో పరిధిలో పనిచేసే 18 మంది మహిళా కండక్టర్లు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ కండక్టర్ ఇంట్లో స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. మహిళ కండక్టర్లతో చర్చించేందుకు యత్నించారు. తమ నాయకులతో పాటు కార్మికులను వదిలిపెట్టె వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.
దీక్ష విరమించిన మహిళా ఆర్టీసీ కండక్టర్లు - tsrtc strike
మహబూబ్నగర్లో స్వీయ గృహ నిర్బంధం చేసుకున్న మహిళా ఆర్టీసీ కండక్టర్లు దీక్ష విరమించారు.
దీక్ష విరమించిన మహిళా ఆర్టీసీ కండక్టర్లు
భాజపా, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు అక్కడికి చేరుకుని కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు మహబూబ్‌నగర్ డీఎస్పీ శ్రీధర్. ఆర్టీసీ, రాజకీయ నాయకులు చర్చలు జరపి... అరెస్ట్ చేసిన కార్మికులను వదిలిపెట్టడంతో మహిళా కండక్టర్లు దీక్ష విరమించారు.
ఇవీ చూడండి: స్వీయ గృహనిర్బంధం చేసుకున్న మహిళా కండక్టర్లు