తెలంగాణ

telangana

ETV Bharat / state

కుటుంబ నియంత్రణ పాట్లు.. రోడ్డే పానుపు - బటన్‌హోల్ సర్జరీ శిబిరం

Mahabubnagar News : చిన్నకుటుంబం.. చింతలేని కుటుంబం అంటూ ప్రభుత్వం ప్రజలకు ఎన్నోరకాలుగా అవగాహన కల్పిస్తోంది. ఒకరిద్దరు సంతానం కలిగిన తర్వాత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచిస్తోంది. దానికోసం అప్పుడప్పుడు శిబిరాలు కూడా నిర్వహిస్తోంది. ఇలా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ శిబిరం ఏర్పాటు చేసింది. కానీ సదుపాయాలు కల్పించడం మరిచిపోయింది.

Mahabubnagar News
Mahabubnagar News

By

Published : Apr 9, 2022, 8:28 AM IST

Mahabubnagar News : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ శిబిరంలో సదుపాయాలు కొరవడ్డాయి. మూడేళ్ల తరవాత కు.ని. బటన్‌హోల్‌ శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించడంతో మహిళలు పెద్దఎత్తున వచ్చారు. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం గుడారం కూడా ఏర్పాటు చేయలేదు. ఆపరేషన్‌ తర్వాత హాలులో కొంతసేపు విశ్రాంతి తీసుకున్న మహిళలు అనంతరం బయటకొచ్చి ఆసుపత్రి ఆవరణలో చెట్ల కింద సీసీరోడ్డుపైనే పడుకొని సేదతీరాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details