తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ తిరుపతిలో భక్తిశ్రద్ధలతో కురుమూర్తి జాతర

కరోనా నిబంధనల నడుమ శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఏడు కొండల మధ్య కొలువుదీరిన స్వామివారు శంకు చక్రాలు, బంగారు కిరీటం, ఆకుపచ్చ పగడాలు, పచ్చలు, ఎర్ర పచ్చల హారాలు, కెంపులు కనక ముత్యాల హారాలు, ఆభరణాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

కరోనా నిబంధనల నడుమ ఘనంగా కురుమూర్తి జాతర
కరోనా నిబంధనల నడుమ ఘనంగా కురుమూర్తి జాతర

By

Published : Nov 19, 2020, 5:05 PM IST

తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన మహబూబ్​నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపూర్ సమీపంలో కొలువుదీరిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు కరోనా నిబంధనల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. వంశాచారంగా ముక్కెర వంశీయులు... స్వామివారికి ఆభరణాలను అలంకరించడం ఆనవాయితీ.

స్వామివారి ఆభరణాలను ఊరేగింపుగా తీసుకొచ్చిన ముక్కెర వంశీయులు... కాంచన గుహలో శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుదీరిన కురుమూర్తి స్వామికి.. నాడు చేయించిన ఆభరణాలను అలంకరించారు.

ఉత్సవాలు ముగిసే వరకు ముక్కెర వంశీయులు అలంకరించిన ఆభరణాలతో స్వామివారు దర్శనమివ్వనున్నారు. శనివారం జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం నిర్వహించనున్నారు. వేలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటం వల్ల ఆలయాధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇదీ చదవండి:'వరదసాయం కింద కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు'

ABOUT THE AUTHOR

...view details