మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని శ్రీ కురుమూర్తి శ్రీనివాసుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి కొండలను పోలినట్లు కురుమూర్తి కొండలైన శేషాద్రి, ఏకాద్రి, దుర్గాద్రి, ఘానాద్రి, బళ్లు కాద్రి, పతాద్రి, దైవతాద్రి, దేవుని గుట్ట.. ఇలా ఏడు కొండల మధ్య దేవుని గుట్టలో కొలువుదీరిన కురుమూర్తి స్వామిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా దక్షణ తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.
ప్రత్యేక ఉత్సవాలు...
ఆశ్విజ మాసం అమావాస్య మొదలు కార్తీక మాసం పాడ్యమి నుంచి సప్తమి వరకు ఆలయంలో వారం రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు కొనసాగుతాయి. రోజుకో వాహన సేవలు నిర్వహిస్తూ... కార్తీకమాసమంతా స్వామివారి జాతర ఉత్సవాలు కొనసాగుతాయి. ప్రధానంగా 16న స్వామి వారి కల్యాణోత్సవం, 19న స్వామివారి అలంకార ఉత్సవం, 21న స్వామివారి ఉత్సవాల్లో ప్రధాన ఉత్సవమైన ఉద్దాల ఉత్సవం నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.
ఊరేగింపులు లేకుండా...