పాలమూరు పల్లె జాతర్లో... పశువుల సంత - kurumurthi bramhotsavalu at palamuru
మహబూబ్నగర్ జిల్లాలో కురుమూర్తి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె జాతరగా ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవాలు రైతులు తమకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లు, కోడె దూడెలను కొనుగోలు చేస్తుంటారు.
మహబూబ్నగర్లో కురుమూర్తి బ్రహ్మోత్సవాలు
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లో కురుమూర్తి స్వామి జాతర వైభవంగా కొనసాగుతోంది. నెలరోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున పల్లె ప్రజలు తరలివస్తారు. ఈ జాతరలో రైతులు తమకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లు, కోడె దూడలు కొనుగోలు చేస్తారు. ఒక్కో కోడె దూడ జంట ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ధర పలకడం విశేషం. దూడ నోటి పండ్ల సంఖ్యను బట్టి దాని వయసును, ధరను నిర్ణయించి రైతులు కొనుగోలు చేస్తారు.
- ఇదీ చూడండి : 'ధనలక్ష్మి దోచేసింది.. న్యాయం చేయండి'