తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Mahbubnagar Speech Today : 'రానున్న రోజుల్లో పారిశ్రామిక ప్రగతికి చిరునామాగా మహబూబ్‌నగర్‌' - మంత్రి కేటీఆర్ మహబూబ్​నగర్​ టూర్​ స్పీచ్

KTR Mahbubnagar Tour Today : ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కొత్త వేషాలతో వస్తున్నారని.. పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలపైనే ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్, మల్లారెడ్డితో కలిసి పర్యటించిన ఆయన.. మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పారిశ్రామిక ప్రగతికి మహబూబ్‌నగర్‌ చిరునామాగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.

KTR Mahbubnagar Speech Today
KTR Mahbubnagar Speech Today

By

Published : Jun 8, 2023, 2:59 PM IST

Updated : Jun 8, 2023, 3:09 PM IST

Minister KTR Tour In Mahbubnagar Today : రాష్ట్రంలో ఆరున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని.. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించడం ద్వారానే ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూత్పూర్ పురపాలికలో ఓపెన్‌ జిమ్‌, మున్సిపల్‌ పార్క్‌, ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ పనులను ఆయన ప్రారంభించారు. మూసాపేట మండలం వేములలో రూ.500 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఓ ప్రైవేట్​ సంస్థకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు.

Minister KTR Comments on 2023 Elections : ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గంలో చెరువుల పునరుద్ధరణ, చెక్‌ డ్యాంల నిర్మాణం ద్వారా 98 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరివెన జలాశయం పూర్తయితే మరో 60 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని.. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కొత్త వేశాలతో వస్తున్నారన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని వివరించారు. ఈ క్రమంలోనే మంత్రుల నియోజకవర్గాలకు దీటుగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో 70 వేల మెజారిటీతో గెలిపిస్తేమరింత అభివృద్ధి సాధ్యమవుతుందనివ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ జిల్లాలో అమర రాజా కంపెనీ, ఐటీ కంపెనీల ప్రారంభంతో వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న కేటీఆర్.. రానున్న రోజుల్లో పారిశ్రామిక ప్రగతికి మహబూబ్‌నగర్‌ చిరునామాగా మారుతుందని స్పష్టం చేశారు.

KTR Launched New Centres In Yadadri : 'రాబోయే ఎన్నికల కోసం కాదు.. రాబోయే తరాల కోసమే కేసీఆర్ తపన'

దేవరకద్ర నియోజకవర్గంలో చెరువుల పునరుద్ధరణ, చెక్‌ డ్యాంల నిర్మాణం ద్వారా 98 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందిస్తున్నాం. కరివెన జలాశయం పూర్తయితే మరో 60 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కొత్త వేశాలతో వస్తున్నారు. పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదే. - మంత్రి కేటీఆర్

KTR Mahbubnagar Speech Today : 'రానున్న రోజుల్లో పారిశ్రామిక ప్రగతికి చిరునామాగా మహబూబ్‌నగర్‌'

ఆకట్టుకున్న మంత్రి మల్లారెడ్డి ప్రసంగం..: దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని.. కేసీఆర్‌ లాంటి ముఖ్యమంత్రి, కేటీఆర్‌ లాంటి ఐటీ శాఖ మంత్రి ఎక్కడా లేరని మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ తరహా పాలన ఎక్కడా లేదన్నారు. ఇలాంటి ప్రభుత్వాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని పేర్కొన్నారు. కేసీఆర్‌ పాలనలో పాలమూరు జిల్లాకు వలసలు వాపస్​ వస్తున్నాయని మరో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తెలిపారు. సాగు నీరు, తాగు నీరు అంది జిల్లా సస్యశ్యామలం అవుతుందని వివరించారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో 14 నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రికి బహుమతిగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి..

అమ్మలాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు.. కేసీఆర్ : కేటీఆర్

KTR Today Tweet: 'తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే'

KTR Tweet on Telangana Agriculture : 'వ్యవసాయం దండుగ అన్నచోటే.. పండుగైంది'

Last Updated : Jun 8, 2023, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details