కృష్ణా నదికి వరద పరవళ్లు తొక్కడం వల్ల పురాతన క్షేత్రాలు జలమయం అయ్యాయి. మంగళవారం సంగమేశ్వరాలయం, సోమశిల, జటప్రోలు ఆలయ గ్రామాల్లో కృష్ణానది ప్రవహిస్తోంది. సంగమేశ్వరాలయం చూట్టూ వరదనీటితో నిండిపోయి ఉంది. నిజానికి చెప్పాలంటే ఈ ఆలయం కర్నూల్ జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మధ్యలో ఉన్న ఈ ఆలయం ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం.
సంగమేశ్వరాలయాన్ని తాకిన కృష్ణమ్మ పరవళ్లు - సంగమేశ్వరాలయం చుట్టూ కృష్ణమ్మ నీరు
కృష్ణమ్మ పరవళ్లతో పురాతన ఆలయాలు జలమయమయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మధ్యలో ఉన్న పురాతనమైన సంగమేశ్వరాలయం చుట్టూ పూర్తిగా నీటితో నిండిపోయింది.
సంగమేశ్వరాలయాన్ని తాకిన కృష్ణమ్మ పరవళ్లు