మహబూబ్‌నగర్- నారాయణపేట జిల్లాల సరిహద్దు మండలాలకు సాగునీటిని అందించే కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు కృష్ణానది నీరు చేరుతోంది. పాలమూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే కోయిల్‌సాగర్ జలాశయం త్వరలోనే నిండుకుండను తలపించనుంది. జూరాల ఎడమ కాల్వ ద్వారా కృష్ణమ్మ పర్దీపూర్ జలాశయాన్ని నిండుకుండలా మార్చింది. కోయిల్‌సాగర్ జలాశయానికి కృష్ణా నీళ్లు చేరడం వల్ల పర్యాటకుల సందడి నెలకొంది. రైతులు.. ప్రజాప్రతినిధులు కలిసి కృష్ణమ్మకు పూలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోయిల్‌సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు - కోయిల్‌సాగర్
మహబూబ్‌నగర్- నారాయణపేట జిల్లాల సరిహద్దుల మధ్య ఉన్న కోయిల్‌సాగర్ జలాశయానికి కృష్ణా నది నీళ్లు చేరుతున్నాయి. రైతులు.. ప్రజాప్రతినిధులు కృష్ణమ్మకు పూలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోయిల్‌సాగర్