తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనెల 8, 9న వెయ్యి జంటలతో కోటి లింగార్చన - mahabubnagar district news today

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో శతపాశుపత సహిత కోటి లింగార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ధార్మిక సేవా సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. 1000 జంటలతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.

koti lingarchana programme at mahabubnagar february 8, 9th thousand couples
ఈనెల 8, 9 వెయ్యి జంటలతో కోటి లింగార్చన

By

Published : Feb 7, 2020, 8:16 AM IST

Updated : Feb 7, 2020, 11:52 AM IST

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రం అమిస్తాపూర్ సమీపంలోని వాసవి కల్యాణ మండపంలో ఈనెల 8, 9 తేదీల్లో 1000 జంటలతో కోటి లింగార్చన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి హంపీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామిజీ, సరస్వతీ పీఠాధీశులు మాధవానంద సరస్వతీ స్వామిజీ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.

కోటి లింగార్చనతోపాటు కోటి పుష్పార్చన, వల్లీ-సుబ్రహ్మణ్యేశ్వర, శివపార్వతుల, శ్రీదేవి-భూదేవి సహిత శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.

ఈనెల 8, 9 వెయ్యి జంటలతో కోటి లింగార్చన

ఇదీ చూడండి :నేడు మేడారానికి గవర్నర్లు, ముఖ్యమంత్రి

Last Updated : Feb 7, 2020, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details