'బలమైన నాయకులుంటే కేసీఆర్ సహించలేరు' - KCR
బలమైన నాయకులుంటే కేసీఆర్ సహించలేరని.. మహబూబ్‌నగర్ లోక్‌సభ భాజపా అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. దేశానికి మోదీ వంటి నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు.

'బలమైన నాయకులుంటే కేసీఆర్ సహించలేరు'
తెరాసలో బలమైన నాయకులు ఉంటే కేసీఆర్ సహించలేరని... వారి అడుగులకు మడుగులు వత్తే వారినే ఆదరిస్తారని డీకే అరుణ విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జన జాగరణ వేదిక ఆధ్వర్యంలో వంద శాతం ఓటింగ్‌పై సదస్సు నిర్వహించారు. భాజపా అభ్యర్థి డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంపై కనీస అవగాహన లేని వారికి కొన్ని పార్టీలు టికెట్లు కేటాయించాయని ఆరోపించారు. దేశానికి మోదీ వంటి బలమైన నాయకత్వం అవసరమని తెలిపారు.
'బలమైన నాయకులుంటే కేసీఆర్ సహించలేరు'
ఇవీ చూడండి:ప్రశ్నించే గొంతుకను గెలిపించండి: రేవంత్‌రెడ్డి