తెలంగాణ

telangana

ETV Bharat / state

"నేను దిల్లీకి వస్తానని వాళ్లకు భయం పట్టుకుంది" - మహబూబ్ నగర్

దేశ ప్రధాని మోదీ...  పచ్చి అబద్ధాలాడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్​ మండిపడ్డారు. తాను రాష్ట్ట్రాభివృద్ధికి అడ్డుపడ్డానని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులివ్వాలని 500 లేఖలు రాసినా ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆవేదన చెందారు.

మహబూబ్ నగర్ సభలో కేసీఆర్

By

Published : Mar 31, 2019, 8:00 PM IST

మహబూబ్ నగర్ సభలో కేసీఆర్
మిషన్​ భగీరథ పథకానికి రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్​ సిఫార్సు చేసినా... కేంద్ర ప్రభుత్వం 24 పైసలు కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్​నగర్​ తెరాస బహిరంగ సభలో పాల్గొన్నారు. తాను దిల్లీకి ఎక్కడ వస్తానో అని భాజపా, కాంగ్రెస్​ నాయకులకు భయం పట్టుకుందన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details