కార్తిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శివాలయాల్లో భక్తులు కార్తిక దీపోత్సవాన్ని నిర్వహించారు. దీపాల కాంతులతో ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని ప్రధాన ఆలయాల్లో పౌర్ణమి ప్రత్యేక పూజలు జరిగాయి.
ఆధ్యాత్మికం: దేవరకద్రలో దీపాల కాంతులతో శివాలయాలు - దేవరకద్ర మండలంలోని శివాలయాల్లో కార్తిక పౌర్ణమి పూజలు
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని శివాలయాలు కార్తిక దీపాల కాంతులతో వెలుగులీనుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని ఆలయాల్లో పున్నమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తుల ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ఆధ్యాత్మికం: దేవరకద్రలో దీపాల కాంతులతో శివాలయాలు
మండలంలోని ఈశ్వర వీరప్పయ్య ఆలయం, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం, పెద్ద గోప్లాపూర్ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. ఆలయం ఆవరణలో భక్తులు వివిధ రూపాలలో దీపాలను అలంకరించి వెలిగించారు. శివనామ స్మరణతో ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఇదీ చదవండి:కార్తికమాస పూజలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ