మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విద్యార్థి మురళీ కార్తీక్ రెడ్డి రసాయన శాస్త్రంలోని 118 మూలకాలను ఆవర్తన పట్టికలో అమర్చటంలో... వండర్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. కార్తీక్ రెడ్డి పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని రసాయన శాస్త్రంలోని ఆవర్తన పట్టికను 117 సెకన్లలో రాసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించింది. కార్తీక్ రెడ్డి దాన్ని బ్రేక్ చేసి కేవలం 81 సెకన్లలోనే బోర్డుపై మూలకాలను రాసి ప్రపంచ రికార్డును తిరగరాశాడు.
ఔరా... రసాయన శాస్త్రంలో ప్రపంచ రికార్డును తిరగరాసిన విద్యార్థి - Mahabubnagar district latest news
రసాయన శాస్త్రంలోని 118 మూలకాలను ఆవర్తన పట్టికలో అమర్చటంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డును సాధించాడు... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విద్యార్థి మురళీ కార్తీక్ రెడ్డి. గతంలో 117 సెకన్లలో రాసిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసి కేవలం 81 సెకన్లలోనే బోర్డుపై మూలకాలను రాసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రికార్డును తిరగరాశాడు.
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణ శ్రీ రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం, మెడల్‌ను విద్యార్థికి అందజేశారు. 118 మూలకాలను ఆవర్తన పట్టికలో అమర్చటంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఉందని కార్తీక్ రెడ్డి తెలిపాడు. దాన్ని తిరగరాయలనే తపనతోనే ఈ రికార్డు చేసేందుకు కృషి చేసినట్లు పేర్కొన్నాడు. భవిష్యత్తులో తన రికార్డును తానే తిరగరాస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇండియన్ నేవి లేదా ఏయిర్‌ఫోర్స్‌లో చేరాలనుకున్న తన లక్ష్యాన్ని సాధించేందుకే కృషి చేస్తున్నానని అన్నారు.
ఇదీ చదవండి: 40 ఏళ్ల వ్యక్తితో బాలిక వివాహానికి ఏర్పాట్లు.. అడ్డుకున్న అధికారులు