తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం - న్యాయశాఖ ఉద్యోగులు

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ సమావేశాలు జరిగాయి.  జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం

By

Published : Jul 8, 2019, 9:36 AM IST

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని లక్ష్మారెడ్డి డిమాండ్​ చేశారు. రెండు నెలల్లో నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలని లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కింది స్థాయి ఉద్యోగి సైతం న్యాయాధికారి పదవికి అర్హత సాధించే విధంగా నిబంధనలను సరిచేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం

ఇవీ చూడండి: ఇక నుంచి అధికారుల ఆకస్మిక తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details