తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోదీతోనే సాధ్యమవుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసురుల్లాబాద్లో వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు భాజపాలో చేరారు. వారికి కండువా వేసి పార్టీలోకి స్వాగతించారు. భాజపా బలోపేతానికి కృషి చేస్తామని చంద్రశేఖర్ అన్నారు. భాజపా జెండాను ఆవిష్కరించారు.
ప్రధాని మోదీతోనే అభివృద్ధి సాధ్యం.. - మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసురుల్లాబాద్లో వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భాజపాలో చేరారు.
![ప్రధాని మోదీతోనే అభివృద్ధి సాధ్యం..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4378055-thumbnail-3x2-fd.jpg)
మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్
ప్రధాని మోదీతోనే అభివృద్ధి సాధ్యం..
ఇవీ చూడండి: వేడుకలకు సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు