వీరజవాన్ పరశురాం అంతిమయాత్రలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దేశసేవలో ప్రాణాలర్పించిన సైనికునికి నివాళులర్పించారు. ఈనెల 24న లద్దాఖ్‌లోని లేహ్‌లో కొండచరియలు విరిగిపడి ప్రమాదవశాత్తు మరణించాడు. స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం గువ్వనికుంట తండాలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రజలు పెద్దఎత్తున హాజరై అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు.
జవాను కుటుంబాన్ని ఆదుకుంటాం : శ్రీనివాస్ గౌడ్ - మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం గువ్వనికుంట తండాలో అంత్యక్రియలు
దేశసేవలో ప్రాణాలర్పించిన అమర జవాన్ పరశురాం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. వీరజవాన్ అంతిమయాత్రలో ఆయన పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం గువ్వనికుంట తండా వాసి కొండచరియలు విరిగిపడి ప్రమాదవశాత్తు మరణించాడు.
జవాను కుటుంబాన్ని ఆదుకుంటాం : శ్రీనివాస్ గౌడ్
అమరుడైన జవాన్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రూ.25 లక్షల సాయాన్ని ప్రకటించామని తెలిపారు. వారికి ఇల్లు కేటాయించి... ప్రభుత్వం తరపున అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని వెల్లడించారు. అంతిమయాత్రలో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, అదనపు కలెక్టర్ సీతారామరావు, అధికారులు పాల్గొన్నారు.