తెలంగాణ

telangana

ETV Bharat / state

'అవగాహన కల్పించడం కోసమే జన అదాలత్' - మహబూబ్​నగర్ జిల్లా లేటెస్ట్ న్యూస్

ఎస్సీ, ఎస్టీ కమిషన్​పై అవగాహన కల్పించడం కోసమే జన అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ప్రజల వద్దకే కమిషన్​ వెళ్లాలనే ఉద్దేశంతో దీనిని ప్రవేశపెట్టామని వెల్లడించారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

jana adalat program by sc st commission in mahabubnagar district
'అవగాహన కల్పించడం కోసమే జన అదాలత్'

By

Published : Dec 9, 2020, 7:39 PM IST

ఎస్సీ, ఎస్టీ కమిషన్ అధికారాలు, చట్టపరిధిపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు... హక్కుల రక్షణ కోసమే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జన అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2014కు ముందు ఎస్సీ,ఎస్టీలకు సంబంధించి 10వేల 500 కేసులు పెండింగ్​లో ఉన్నాయని, కమిషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 8,500 కేసులు పరిష్కరించినట్లు ఆయన చెప్పారు. రూ.56 కోట్ల పరిహారాన్ని బాధితులకు ఇప్పించినట్లు వెల్లడించారు.

పౌర హక్కుల దినోత్సవాలు కేవలం 20 నుంచి 25 మండలాల్లో నిర్వహిస్తే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 581 మండలాలకుగాను 552 మండలాల్లో చేపట్టామన్నారు. 98శాతం గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవాన్ని జరిపిన కమిషన్​గా... దేశానికే తెలంగాణ ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఓ నమూనాగా నిలిచిందన్నారు. ఇప్పటికే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో జన అదాలత్ నిర్వహించి 1500 దరఖాస్తులు స్వీకరించామని, త్వరలోనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

మహబూబ్​నగర్ జిల్లా తర్వాత మెదక్​లో ఈ నెల 16,17,18 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పేద కుటుంబాలకు చెందిన వారు... వారి సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్​కి రావాల్సిన అవసరం లేకుండా... ప్రజల వద్దకే కమిషన్ వెళ్లాలనే ఉద్దేశంతో జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నామని వివరించారు. జన అదాలత్​ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:కొత్త పార్లమెంట్ భవనానికి గురువారం భూమిపూజ

ABOUT THE AUTHOR

...view details