మహబూబ్‌నగర్‌లోని జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెరాస అభ్యర్థుల తరఫున... ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో ఎవరూ ఓట్లు అడిగినా తెరాసకు ఓటు వేయాలని సూచించారు. తక్కువ ఓట్లు వస్తే ఇళ్లు, నీళ్లు ఇవ్వను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుడగజంగాల కాలనీలో ఆయన వ్యాఖ్యలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
'తక్కువ ఓట్లు వస్తే ఇళ్లు, నీళ్లు ఇవ్వను' - మున్సిపల్ ఎన్నికలు 2021
‘‘ఎన్నికల్లో వారు, వీరు మస్తు వస్తారు. ఓట్లు అడుగుతారు. ఏ పని అయినా చేయాల్సింది మనమే. పొరపాటున తక్కువ ఓట్లు వస్తే ఇళ్లు, నీళ్లు ఇవ్వను..’’ అంటూ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
'తక్కువ ఓట్లు వస్తే ఇళ్ల్లు, నీళ్లు ఇవ్వను'
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అనిరుధ్‌రెడ్డి, భాజపా జాతీయ అధ్యక్షురాలు డి.కె.అరుణ... లక్ష్మారెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ‘‘బుడగజంగాల కాలనీ వాసులు నాతో మాట్లాడుతూ ఇళ్లు కావాలని అడిగారు. సాధారణ రీతిలో వారితో సాగిన సంభాషణను కొందరు వక్రీకరించారు. అభివృద్ధి చేసే తెరాసకు ఓట్లు వేయాలని కోరా’’ అని వివరించారు.