మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల పురపాలికకు జరిగిన ఎన్నికల్లో 66.60 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 41,761 మంది ఓటర్లు ఉండగా.. 27,813 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా రెండో వార్డులో 82.08 పోలింగ్ శాతం నమోదు కాగా.. అత్యల్పంగా 15వ వార్డులో 52.59 పోలింగ్ శాతం నమోదైంది.
పురుషుల్లో 68.17 శాతం మంది, మహిళల్లో 65.03 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వార్డు మొత్తం ఓట్లు పోలైనవి పోలింగ్ శాతం
1 1430 1092 76.36
2 1607 1319 82.08
3 1740 1082 62.18
4 1686 1159 68.74
5 1564 1248 79.80
6 1443 762 52.81
7 1535 1106 72.05
8 1541 959 62.23
9 1606 1012 63.01
10 1678 1176 70.08
11 1520 1090 71.71
12 1660 939 56.57