పోలేపల్లిలో అంతర్జాతీయ పశుపోషకాల ఉత్పత్తి పరిశ్రమ - Trove Nutrition Industry in mahabubnagar district
మహబూబ్‌నగర్ జిల్లాలో మరో అంతర్జాతీయ పరిశ్రమ ఏర్పాటైంది. జడ్చర్ల మండలం పోలేపల్లిలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ట్రౌవ్ న్యూట్రిషన్ పరిశ్రమ ఈనెల 7న ప్రారంభం కానుంది.
![పోలేపల్లిలో అంతర్జాతీయ పశుపోషకాల ఉత్పత్తి పరిశ్రమ International Animal Nutrition Production Industry in Polepally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9780079-thumbnail-3x2-a.jpg)
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లిలో మరో అంతర్జాతీయ స్థాయి పరిశ్రమ ప్రారంభంకానుంది. అక్కడి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటైన ‘ట్రౌవ్ న్యూట్రిషన్’ పరిశ్రమను ఈ నెల 7న నెదర్లాండ్ దేశ రాయబారి ప్రారంభిస్తారని ఆ సంస్థ దక్షిణ భారత మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్‌శేఖర్ తెలిపారు. అందులో పశుపోషకాలను ఉత్పత్తి చేస్తామన్నారు. నెదర్లాండ్స్‌లోని న్యూట్రెకో గ్రూప్‌నకు చెందిన పశుపోషకాల ఉత్పత్తి సంస్థ ట్రౌవ్ న్యూట్రిషన్ 52 దేశాల్లో విస్తరించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా తమ సంస్థ పని చేస్తుందన్నారు.
TAGGED:
మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు