NGT Inquiry on Palamuru-Rangareddy: కేంద్ర అటవీ పర్యావరణశాఖపై ఎన్‌జీటీ చెన్నై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై ఎన్‌జీటీ ముందు కౌంటర్ దాఖలు చేయక పోవడంపై మండిపడింది. ఈ మేరకు ఇవాళ ప్రాజెక్టు నిర్మాణంపై ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది.
రూ. 10వేల జరిమానా...
ఈనెల 24లోపు కౌంటర్ దాఖలు చేయాలన్న ఎన్‌జీటీ చెన్నై బెంచ్... కౌంటర్ వేయకపోతే రూ.10 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పదేపదే కేంద్రం వాయిదాలు కోరడంపై ఎన్‌జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం చెరువుల్లో మట్టి తవ్వుతున్నారని... జడ్చర్ల వాసి కోస్గి వెంకటయ్య ఎన్‌జీటీలో పిటిషన్ దాఖలు చేశారు.
జనవరి 6కు వాయిదా...
ముంపు ప్రాంతాల్లో మట్టి తవ్వడం పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని ఇప్పటికే నివేదిక ఇచ్చింది. అయితే కమిటీ అసమగ్రంగా నివేదిక ఇచ్చిందని పేర్కొన్న పిటిషనర్ కోస్గి వెంకటయ్య... 210 చెరువుల నుంచి ఇష్టానుసారం మట్టి తవ్వారని తెలిపారు. పర్యావరణశాఖ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోకుండా ఎన్జీటీని ఆదేశించమనడం విడ్డూరమన్నారు. తదుపరి విచారణ జనవరి 6కు ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌కు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: