తెలంగాణ

telangana

వచ్చే ఎన్నికల్లో బరిలో మహాజన సోషలిస్టు పార్టీ: మందకృష్ణ

By

Published : Sep 6, 2020, 9:55 AM IST

తెరాస ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీలకు మూడెకరాల భూపంపిణీ చేపట్టకపోగా... గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. భూముల పరిరక్షణ కోసం మహబూబ్​నగర్​లో చేపట్టిన నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొన్నారు.

initiation-for-conservation-of-assigned-lands-for-sc-st-and-bc-in-mahabubnagar-district
మూడెకరాల భూపంపిణీ చేపట్టకపోగా.. లాక్కుంటుంది: మందకృష్ణ

రాష్ట్రంలో అత్యధిక శాతం జనాభా ఉన్న మాదిగలకు తెరాస మంత్రి వర్గంలో ఒక్కరికీ చోటు దక్కలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ప్రస్తుత పాలకులు, ప్రతిపక్షాలు సైతం దళిత సామాజిక వర్గాలను పట్టించుకోవడం లేదన్న ఆయన.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో అణగారిన వర్గాల తరపున మహాజన సోషలిస్టు పార్టీ ఎన్నికల బరిలో నిలవనుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన అసైన్జ్ భూముల పరిరక్షణ కోసం మహబూబ్​నగర్​లో చేపట్టిన నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొన్నారు.

తెరాస ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీలకు మూడెకరాల భూపంపిణీ చేపట్టకపోగా... గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ప్రకృతి వనాల పేరుతో లాక్కుంటుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​ ఓటమి ఖాయమన్నారు.

ఇదీ చూడండి:ఎన్​కౌంటర్​ ఎఫెక్ట్:​ పోలీసుల విస్తృత తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details