మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో వినాయక నిమజ్జనాలు ఘనంగా జరిగాయి. గణేశుడి నవరాత్రి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన నిమజ్జనాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. గతంలో చేసినంత హంగామా లేకపోయినా.. భక్తి శ్రద్ధలతో మట్టి గణపతులకు ప్రాధాన్యత ఇస్తూ గణనాథుని గంగమ్మ వడికి చేర్చుతున్నారు.
ప్రశాంత వాతావరణం నడుమ దేవరకద్రలో గణేశుడి నిమజ్జనాలు
వినాయక నవరాత్రి ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన నిమజ్జన మహోత్సవాన్ని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఘనంగా నిర్వహించారు. గతంలో చేసినంత హంగామా లేకపోయినా.. మట్టి గణనాథులకు ప్రాధాన్యం ఇస్తూ నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.
ప్రశాంత వాతావరణం నడుమ దేవరకద్రలో గణేశుడి నిమజ్జనాలు
జిల్లా నలుమూలల నుంచి వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం దేవరకద్రకు సమీపంలో ఉన్న.. కోయిల్ సాగర్ జలాశయానికి తరలివచ్చాయి. బండర్‌పల్లి చెక్‌డ్యామ్ 167వ జాతీయ రహదారికి సమీపంలో ఉండటం వల్ల రహదారిపై వెళ్లే ప్రయాణికులు నిమజ్జన మహోత్సవాన్ని తిలకించారు.
ఇదీ చూడండి :నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష