విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రజల్లో కనిపించే ఐక్యత అభినందనీయమని హైదరాబాద్ రీజియన్ ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. కరోనా మహమ్మారి నియంత్రణకు మహబూబ్ నగర్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ నిబంధనలు పాటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఒకరికొకరు సహకరించుకోవడం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
Corona: 'కొవిడ్ నియంత్రణలో గ్రామాల కృషి అభినందనీయం' - తెలంగాణ వార్తలు
కరోనా మహమ్మారి నియంత్రణలో గ్రామాల ఐక్యత అభినందనీయమని హైదరాబాద్ రీజియన్ ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర కొనియాడారు. మహబూబ్నగర్ జిల్లాలోని పలు గ్రామాలను ఆయన సందర్శించారు.
జిల్లాలోని మూసాపేట, అడ్డాకుల మండలంలోని వేముల, పొన్నకల్ గ్రామాలను ఐజీపీ సందర్శించారు. ప్రజా ప్రతినిధులను, గ్రామస్థులను అభినందించారు. కొవిడ్ మహమ్మారి నిర్మూలనలో ముందుండి పనిచేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల విధులను ప్రశంసిస్తూ వారిని శాలువాతో సత్కరించి పండ్లు అందజేశారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్పీ రావిరాల వేంకటేశ్వర్లు, పోలీసు అధికారులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:FIRE: ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు