మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శివరాత్రి వేళ దైవచింతన కోసం మన్యంకొండ వెళ్తున్న ఓ కుటుంబంలో మృత్యురోదనలు మిన్నంటాయి. హన్వాడ మండలం పుల్పోనిపల్లికి చెందిన వెంకటేశ్... బంధువులతో కలిసి మన్యంకొండ జాతరకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు.
శివరాత్రి వేళ విషాదం.. జాతరకు వెళ్తూ తండ్రీకూతురు మృతి - ACCIDENT NEWS IN TELANGANA
శివరాత్రి వేళ ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మన్యంకొండ జాతరకు వెళ్లి శివనామస్మరణలో జాగారం చేయాలనుకున్న ఆ కుటుంబ భవితవ్యం తెల్లారిపోయింది. కూతుళ్లతో కలిసి ఆ తండ్రి చేసిన ప్రయాణమే ఆఖరి ప్రయాణంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు.
HUGE ACCIDENT AT DHARMASAGAR
భార్య బంధువులతో కలిసి బస్సులో బయలుదేరగా.. వెంకటేశ్ తన ఇద్దరు కూతుళ్లతో ద్విచక్ర వాహానంపై బయలుదేరాడు. ధర్మాపూర్ సమీపంలోకి రాగానే... ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీ కొట్టింది. ప్రమాదంలో వెంకటేశ్‌తో పాటు, కూతురు నిఖిత అక్కడికక్కడే మృతి చెందారు. మరో కూతురు హారికను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.