మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. పిటిషన్‌దారు చేసిన ప్రతి అభియోగంపై సవివరంగా విచారణ జరిపి.. ఏప్రిల్ 15లోపు తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఫిర్యాదుదారు ఆరోపించినట్లుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సంబంధించిన వ్యక్తుల నుంచి అతనికి ప్రాణహాని ఉన్నట్లుగా ఆధారాలు దొరికితే.. తక్షణమే పోలీసు రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది.