మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి కురుస్తున్న వానకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రామయ్యబౌలి, శివశక్తినగర్, ఎర్రమన్నుగుట్ట, కుర్హిశెట్టి కాలనీలు నీటమునిగాయి. జిల్లా కేంద్రంలోని చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. నాలాలు పొంగి పొర్లడం వల్ల ఇళ్లలోకి నీరు చేరాయి. నీళ్లు మళ్లించేందుకు దారిలేకపోవడం వల్ల పలు ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
మహబూబ్నగర్లో భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో పలు నివాసాలు - Rain in mahabubnagar
తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు పెద్దచెరువు నిండి మత్తడి పోస్తోంది.
![మహబూబ్నగర్లో భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో పలు నివాసాలు houses were surrounded by rain water in mahabubnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8945967-807-8945967-1601113081056.jpg)
మహబూబ్నగర్లో భారీ వర్షాలు
వాన పడుతున్న ప్రతిసారి తమ పరిస్థితి ఇలాగే ఉంటోందని కాలనీవాసులు వాపోయారు. నీళ్లు ఇళ్లలోకి చేరినప్పుడు కాలనీలో పర్యటించి ఓదార్చే వారే తప్ప.. శాశ్వత పరిష్కారం చూపేవారు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
- ఇదీ చూడండి : 'రాష్ట్రానికి 10 లక్షల టన్నుల యూరియా కేటాయింపు' మహబూబ్నగర్లో భారీ వర్షాలు