చిన్నారులపై తేనెటీగల దాడి... ఒకరికి ప్రాణాపాయం - undefined
పాఠశాల ఆవరణలో తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటున్నారు. ఆటలో మైమరిచిపోయి ఉన్న వారిపై అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి. ఒక్కసారిగా తేనెటీగలు దాడిచేయడంతో ఆ చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
చిన్నారులపై తేనెటీగల దాడి... ఒకరికి ప్రాణాపాయం
మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం సూరారంలో పాఠశాల విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 24 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఒక్కసారిగా తేనెటీగలు మీదకు రావడంతో చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 23 మంది పిల్లల వార్డులో చికిత్స పొందుతున్నారు. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
- ఇదీ చూడండి : టెక్ మోసం: ఒక్క బిర్యానీ కోసం రూ.40వేలు ఉఫ్