మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ప్రచారం నిర్వహించారు. ముస్లిం ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్, భాజపాలు మైనార్టీలను ఓటు బ్యాంకు లానే చూశారు తప్పా... అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తెరాస మాత్రం అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి నిరుపేదలకు అందించిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 16 సీట్లతో కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పుతారని ధీమా వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి జరగలాంటే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడాల్సిందేనని మహమూద్ అలీ అభిప్రాయపడ్డారు.
'దేశాభివృద్ధి కోసమే ఫెడరల్ ఫ్రంట్' - kcr
కాంగ్రెస్, భాజపాలు దేశాభివృద్ధికి చేసిందేమి లేదని హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలోని ముస్లిం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

ప్రచారంలో మహమూద్ అలీ