మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని సీతారాంపేట గ్రామంలోని ప్రధాన చెరువుకు వరదనీరు రావడం వల్ల చెరువుకట్టకు గండి పడింది. అక్కడ వరద నీరు పొంగిపొర్లుతూ... ఆయకట్టు పొలాలను నిండా ముంచేసింది.
అలుగుపోస్తున్న చెరువులు.. నీట మునిగిన పంటలు - మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో రాత్రి కురిసిన వర్షానికి వాగలు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. ఆయకట్టు కింది పొలాలు నీటమునిగాయి.
అలుగులు పొస్తున్న చెరువులు.. నీట మునిగిన పంటలు
సుమారు ఐదు వందల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగినట్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు సమీపంలో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరి.. ఇంట్లో ఉన్న వస్తువులు నీట మునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నియోజకవర్గంలోని పలు చోట్ల పంటలు నీట మునగడం, ఇళ్లలోకి వరద నీరు చేరడం.. బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు... ఆపద సమయంలో భరోసా కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.
- ఇదీ చూడండి: రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు మోస్తరు వర్షాలు