మహబూబ్‌నగర్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఫలితంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు అలుగు పారడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామయ్యబౌళి, బీకే రెడ్డి కాలనీ, భగీరథ కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.
భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - మహబూబ్‌నగర్ వ్యాప్తంగా జోరుగా వర్షం వార్తలు
మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. ఫలితంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్కూర్‌లో వాగు పొంగడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
కోయిల్‌కొండ మండల పరిధిలోని భవాని సాగర్ చెరువు సైతం అలుగు పారుతోంది. సూరారం వాగు పొంగి పొర్లుతోంది. హన్వాడ మండల పరిధిలోని చెరువులు, వాగులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. మక్తల్ మండలంలోని వర్కూర్‌లో వాగు పొంగిపొర్లడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మొత్తంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇదీచూడండి: రెండోరోజుకు సమ్మె.. నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి..!