మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పట్టణ పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. మార్కెట్ యార్డులో, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దేవరకద్రలో భారీ వర్షం.. రహదారులన్నీ జలమయం - heavy rain in mahabubnagar district
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడం వల్ల సొంతూళ్లకు వెళ్లే వారు వర్షంలో తడిసి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
దేవరకద్రలో వర్షం, మహబూబ్నగర్ జిల్లాలో వర్షం
కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి లాక్డౌన్ విధించడం వల్ల సొంతూళ్లకు వెళ్లేందుకు పయనమైనవారు వర్షంలో తడిసిపోయారు. దేవరకద్ర పట్టణంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి.