మహబూబ్నగర్ పట్టణం మంచు దుప్పటి కప్పుకుంది. వేకువజాము నుంచి విపరీతంగా మంచు కురుస్తూ... ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఉదయం 9 గంటలు దాటినా... సూర్యుడు జాడ లేకపోవడంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోజువారీ పనుల నిమిత్తం బయటికి వెళ్లే రోడ్డు మార్గం సరిగా కన్పించకపోవటం వల్ల జనాలు కొంత ఇబ్బందికి గురయ్యారు. పట్టణం నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర మంచు కమ్మేసింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది.
మంచు దుప్పటి కప్పుకున్న మహబూబ్నగర్.... - HEAVY FOG IN THE MORNING AT MAHABOOBNAGAR
ఓ వైపు చలి... మరో వైపు ఎటు చూసినా పొగమంచుతో మహబూబ్నగర్ వాసులు ఆహ్లాదకరవాతావరణాన్ని ఆస్వాదించారు. ఉదయం 9 గంటల వరకు సూర్యున్ని దాచేసిన మంచు... స్థానికులకు కన్నుల విందైన దృశ్యాల్ని చూపించింది.
![మంచు దుప్పటి కప్పుకున్న మహబూబ్నగర్....](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5122012-thumbnail-3x2-ppp.jpg)
HEAVY FOG IN THE MORNING AT MAHABOOBNAGAR
TAGGED:
Poga_Manchu